డబ్ల్యూటీసీ ఫైనల్: ఆరో రోజు ఆటకు అనుకూలమైన వాతావరణం..?

ABN , First Publish Date - 2021-06-23T17:36:23+05:30 IST

వరల్డ్ టెస్టు చాంపియన్‎షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారిపోయింది. అయితే.. రిజర్వ్

డబ్ల్యూటీసీ ఫైనల్: ఆరో రోజు ఆటకు అనుకూలమైన వాతావరణం..?

సౌథాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్‎షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారిపోయింది. అయితే.. రిజర్వ్ డే ఆరో రోజుకు చేరుకుంది. బుధవారం సౌథాంప్టన్‎లో వాతావరణం ఎలా ఉంటుంది.. అసలు ఆటను సవ్యంగా సాగనిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే వాతావరణం మెరుగ్గా ఉంది. ఆకాశంలో మబ్బులు ఉన్నాగానీ..వెలుతురు బాగానే ఉంటుంది. అలాగే ఇవాళ సౌథాంప్టన్‎లో వర్షం పడే అవకాశం లేకపోవడం శుభసూచకం. బుధవారం ఉదయం 10  గంటలకు 16 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, సాయంత్రం 5 గంటలకు 20 డిగ్రీల వరకు చేరుకుంటుందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు బాగా ఎండకాస్తే మాత్రం టీమిండియాకే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒక వేళ చల్లటి వాతావరణం పరిస్థితులు ఉంటే..కివీస్ ఆధిపత్యం చెలాయించడం ఖాయం.


ఆధిక్యంలో కోహ్లీ సేన

ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‎లో టీమిండియా 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత జట్టు బుధవారం తొలి సెషన్‌ వరకు వేగంగా ఆడి ప్రత్యర్థికి లక్ష్యం విధిస్తుందా? లేక డ్రా కోసం ప్రయత్నిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు భారత పేసర్లు షమి (4/76), ఇషాంత్‌ (3/48) విజృంభించి కివీస్‎ను కట్టడి చేశారు. అయితే కేన్‌ విలియమ్సన్‌(177 బంతుల్లో 6 ఫోర్లతో 49) కీలక ఆటతీరుతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 249 పరుగులు చేసింది. అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. కివీస్‎కు 32 రన్స్‌ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ మంగళవారం ఐదో రోజు ఆట ముగిసేసరికి 30 ఓవర్లలో 2వికెట్లకు 64 పరుగులు చేసింది. క్రీజులో పుజార (12), కోహ్లీ (8) ఉన్నారు. 



Updated Date - 2021-06-23T17:36:23+05:30 IST