డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణ గండం?

ABN , First Publish Date - 2021-06-17T09:28:31+05:30 IST

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణ గండం?

సౌతాంప్టన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం మొదలవనున్న  ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉంది. వాతావరణ శాఖ అంచనాను పరిశీలిస్తే రిజర్వ్‌ డే సహా ఫైనల్‌కు వర్షం అంతరాయం తప్పదు. ఈనెల 19, 20, 22 తేదీలలో వర్షం పడే అవకాశముందని చెబుతోంది. 18, 21 తేదీల్లో వానకు అవకాశం లేకపోయినా ఆ రెండురోజులు పూర్తిగా ఎండమాత్రం ఉండబోదని పేర్కొంటోంది. రిజర్వ్‌ డే రోజునూ వరుణుడు అడ్డుకొనే అవకాశముందని అంటోంది. 

Updated Date - 2021-06-17T09:28:31+05:30 IST