మృతులు 3300 కాదు... 42000 : చైనా జనం మాట!

ABN , First Publish Date - 2020-03-30T16:08:04+05:30 IST

చైనాలోని ఉహాన్ వాసులు తమ నగరంలోనే ఏకంగా 42,000 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా చైనా మొత్తం మీద కేవలం 3300 మంది మాత్రమే మరణించారని...

మృతులు 3300 కాదు... 42000 :  చైనా జనం మాట!

బీజింగ్: చైనాలోని ఉహాన్ వాసులు తమ నగరంలోనే ఏకంగా 42,000 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా చైనా మొత్తం మీద కేవలం 3300 మంది మాత్రమే మరణించారని చైనా ప్రభుత్వం చెబుతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మృతుల గురించి  సమగ్రంగా దర్యాప్తు జరగలేదని,  లెక్కకు మించి జనం వారి ఇళ్లలోనే  మరణించారని చెబుతున్నారు. ఒక్క నెలలోనే 28 వేల మృతదేహాలను దహనం చేశారనే వార్తలు వినిపించాయి. చైనా అధికారులు ఇచ్చిన గణాంకాల కంటే ఉహాన్ ప్రజలు చెబుతున్న మృతుల సంఖ్య 10 రెట్లు ఎక్కువ. ప్రపంచమంతటినీ వణికిస్తున్న కరోనా వైరస్ సంక్రమణ చైనాలోని ఉహాన్ లో ప్రారంభమైంది. కాగా మృతులకు సంబంధించి ప్రతిరోజూ 500 ఆస్తికల కలశాలను బంధువులకు ఇస్తున్నట్లు వుహాన్‌లో నివసిస్తున్న ప్రజలు చెబుతున్నారు. ఇలా 7 అంత్యక్రియల గృహాల నుంచి  ప్రతిరోజూ సుమారు 3500 మందికి  అస్తికలు కలశాలను ఇస్తున్నారు.ఈ విధంగా 12 రోజుల్లో 42 వేల అస్తికలు కలశాలను వారి బంధువులకు అందజేయనున్నారని తెలుస్తోంది. 


Updated Date - 2020-03-30T16:08:04+05:30 IST