`118` వంటి హిట్ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ తెరకెక్కించిన చిత్రం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` (హూ, వేర్, వై). థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను రవి పి.రాజు దాట్ల నిర్మించారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా విడుదల చేశారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది.