Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 26 2021 @ 18:17PM

బీజేపీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

కరీంనగర్: బీజేపీకి హుజురాబాద్‌లో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్ది‌రెడ్డి రాజీనామా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి పెద్దిరెడ్డి భంగపడ్డారు. బీజేపీలో ఈటల రాజేందర్ చేరికను ఆయన వ్యతిరేకించారు. రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీలో ఇమడలేకపోతున్నామనే భావనలో పెద్దిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారని సమాచారం. పెద్దిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పని చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆయన బలమైన నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం బీజేపీలో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీకి గుడ్ బై చెప్పారనే ప్రచారం జరుగుతోంది. 



Advertisement
Advertisement