Abn logo
Feb 22 2020 @ 19:31PM

బిల్‌గేట్స్‌కి థ్యాంక్స్ చెప్పిన జిన్ పింగ్.. ఎందుకంటే..

బీజింగ్: చైనాను ప్రస్తుతం కుదిపేస్తున్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బిల్ గేట్స్, మెలిండా గేట్స్ వాళ్ల ఫౌండేషన్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరం రాశారు. 


చైనా ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉదారంగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు జిన్ పింగ్ ధన్యవాదాలు తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని జింహువా అనే న్యూస్ ఏజెన్సీ పోస్ట్ చేసింది. ప్రపంచ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఫౌండేషన్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాక, ఫౌండేషన్ చేస్తున్న సహాయాన్ని చైనా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఆయన ఉత్తరంలో పేర్కొన్నారు. వైరస్‌పై పోరాడేందుకు ‘‘ఐక్యత మరియు సహకారం అత్యంత శక్తివంతమైన ఆయుధాలు’‘ అని జిన్ పింగ్ అన్నారు. 


కాగా, వైరస్‌ గురించి ప్రపంచానికి తెలిసిన వెంటనే దాని అరికట్టేందుకు సహాయార్థం ఫౌండేషన్ 100 మిలియన్ల డాలర్లు విడుదల చేసింది. ఈ విరాళాన్ని చైనాతో పాటు వైరస్ బారీనపడ్డ అన్ని దేశాల్లో వైరస్‌ని గుర్తించేందుకు, అరికట్టేందుకు, వ్యాధి బారినపడ్డ వారికి వైద్యం అందించేందుకు వినియోగిస్తామని తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement