షావోమీ హైపర్‌ ఫోన్‌ ‘17 నిమిషాల్లో ఫుల్‌’

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

షావోమీ ‘హైపర్‌ ఫోన్‌’గా అభివర్ణిస్తున్న ‘షావోమీ 11టి ప్రొ’ భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఏడాది రిలీజ్‌ చేస్తున్న మొదటి ఫోన్‌ ఇది...

షావోమీ హైపర్‌ ఫోన్‌ ‘17 నిమిషాల్లో ఫుల్‌’

షావోమీ ‘హైపర్‌ ఫోన్‌’గా అభివర్ణిస్తున్న ‘షావోమీ 11టి ప్రొ’ భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఏడాది రిలీజ్‌ చేస్తున్న మొదటి ఫోన్‌ ఇది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఇది లభ్యమవుతోంది. 120 వాట్స్‌  ఫాస్ట్‌ చార్జింగ్‌ దీనికి సంబంధించి కీలకమైన అంశం. 17 నిమిషాల్లో  చార్జింగ్‌ పూర్తవుతుంది. మూడు రకాలుగా ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజీ కలిగిన ఫోను రూ.39,999, 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీ కలిగిన ఫోను రూ.41,999, 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీ కలిగిన ఫోను రూ.43,999 కి లభిస్తాయి. పాత స్మార్ట్‌ఫోన్లకు రూ.5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST