వూహాన్‌లో తిరిగి తెరుచుకున్న షియోమీ హెడ్‌క్వార్టర్స్

ABN , First Publish Date - 2020-04-01T01:36:43+05:30 IST

వూహాన్‌లోని తమ హెడ్‌క్వార్టర్స్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్టు చైనీస్ స్మార్ట్‌ఫోన్

వూహాన్‌లో తిరిగి తెరుచుకున్న షియోమీ హెడ్‌క్వార్టర్స్

బీజింగ్: వూహాన్‌లోని తమ హెడ్‌క్వార్టర్స్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్టు చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ తెలిపింది. ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, రెడ్ ఎన్వలప్‌లతో కూడిన పూర్తి రక్షణ చర్యల మధ్య తొలి బ్యాచ్‌ ఉద్యోగులను షియోమీ అక్కడికి పంపినట్టు టెక్నికల్ బ్లాగ్ ‘గిజ్మోచైనా’ పేర్కొంది. కట్టుదిట్టమైన నివారణ, నియంత్రణ చర్యల మధ్య షియోమీ తన కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 20న షియోమీ ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేసింది. వూహాన్ ఈస్ట్‌లేక్ జోన్‌లో ఉన్న షియోమీ హెడ్‌క్వార్టర్స్ ‘ఎల్’ ఆకారంలో ఉంటుంది. దాదాపు 52 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు భూగర్భ అంతస్తులు, 7 ఫోర్లతో ఉంటుంది. ఇందులో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Updated Date - 2020-04-01T01:36:43+05:30 IST