వైగై డ్యామ్‌లో పొంగిప్రవహిస్తున్న జలాలు

ABN , First Publish Date - 2021-11-20T16:20:43+05:30 IST

మదురైలోని వైగై డ్యామ్‌ వద్ద ఇరు వైపులా నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. డ్యామ్‌లో వెలువడుతున్న జలాల కారణంగా రహదారి వంతెనలపై వరద దృశ్యాలు నెలకొన్నాయి. దీంతో మదురై, శివగంగ, రామనాధపురం జిల్లాల్లో వై

వైగై డ్యామ్‌లో పొంగిప్రవహిస్తున్న జలాలు

చెన్నై: మదురైలోని వైగై డ్యామ్‌ వద్ద ఇరు వైపులా నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. డ్యామ్‌లో వెలువడుతున్న జలాల కారణంగా రహదారి వంతెనలపై వరద దృశ్యాలు నెలకొన్నాయి. దీంతో మదురై, శివగంగ, రామనాధపురం జిల్లాల్లో వైగై వాగుకు ఇరు వైపులా నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వైగై డ్యామ్‌ వద్ద ఎనిమిది అడుగుల ఎత్తున జలాలు వేగంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు ఆ డ్యామ్‌ వద్దకు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా వైగై డ్యామ్‌ వరద దృశ్యాలను ఆ డ్యామ్‌పైనున్న రహాదారిపై నిలచి ప్రజలు ఆసక్తిగా తిలకిస్తుండటంతో సింహక్కల్‌, యానైక్కల్‌, గోరిపాళయం ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2021-11-20T16:20:43+05:30 IST