Telangana: యాదాద్రిలో దారుణం

ABN , First Publish Date - 2021-08-26T16:10:32+05:30 IST

జిల్లాలోని అడ్డగూడురు మండలం కంచనపల్లిలో దారుణం జరిగింది.

Telangana: యాదాద్రిలో దారుణం

యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని అడ్డగూడురు మండలం కంచనపల్లిలో దారుణం జరిగింది. పక్షవాతం వచ్చిన వృద్ధుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చాపలో చుట్టేసి రోడ్డు వెంట పడేసి వెళ్లిపోయారు. వృద్ధుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడి వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2021-08-26T16:10:32+05:30 IST