యాదాద్రిలో వైభవంగా లక్ష్మీ పూజలు

ABN , First Publish Date - 2020-12-05T06:00:52+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం లక్ష్మీపూజలు వైభవంగా కొనసాగాయి.

యాదాద్రిలో వైభవంగా లక్ష్మీ పూజలు

ప్రత్యేక అలంకరణలో ఆండాళ్‌ అమ్మవారు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం లక్ష్మీపూజలు వైభవంగా కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను సువర్ణపుష్పాలతో అర్చించారు. అనంతరం ఉత్సవ మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణ వేడుకలు నిర్వహించారు. ఆలయానికి శుక్రవారం భక్తుల నుంచి రూ.12,49,747ఆదాయం సమకూరింది. 


రథశాల నిర్మాణ పనులకు శ్రీకారం 

యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వామివారి దివ్యవిమాన రథాన్ని నిలిపేందుకు రథశాల నిర్మాణానికి కార్మికులు శ్రీకారంచుట్టారు. 29 అడుగుల ఎత్తు, 6.6 మీటర్ల వెడల్పుతో రథశాల నిర్మించ నున్నారు. ఈ రథశాల నిర్మాణంకోసం సుమారు 40టన్నుల ఐరన్‌ను వినియోగించనున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు.  ప్రధానాలయం నిర్మించిన రెండు లిఫ్టులకు ముందువైపు ఆధ్యాత్మి కభావాన్ని పెంచేలా ఇత్తడి తొడుగులను అమర్చనున్నారు. శుక్రవారం ఈ మేరకు ఇత్తడి తొడుగులు, వాటిపై అమర్చనున్న కలశాలను యాదాద్రికి తీసుకువచ్చినట్లు స్తపతులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-05T06:00:52+05:30 IST