Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేడు యాదాద్రి క్షేత్రానికి సీఎం KCR

యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి క్షేత్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా  ఆలయ ఉద్ఘాటన , మహా సుదర్శన యాగం నిర్వహణ  తేదీ వివరాలను సీఎం ప్రకటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి  యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకోనున్నారు. ఆలయ  పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నింటిని మరోసారి పరిశీలిస్తారు. యాదాద్రి పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించారు. యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి  చేశారు. రాచకొండ కమిషనరేట్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement