Abn logo
Aug 31 2021 @ 07:50AM

Yadadri జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

యాదాద్రి: జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలకు గుట్ట, ఆలేరు, రాజాపేట మండలాల్లో గల చెరువులు, కుంటలు నిండిపోయాయి. వర్షపు నీటితో ఆలేరు- కొలనుపాక మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు మండలం మురిపిరాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.