Abn logo
Sep 21 2021 @ 12:34PM

సీజరింగ్ చేసి మహిళ కడుపులో కాటన్‌ను మరిచిన వైద్యులు

యాదాద్రి: భువనగిరి కే.కే నర్సింగ్ హోమ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళకు సీజరింగ్ చేసే సమయంలో వైద్యులు ఆమె కడుపులో కాటన్‌ను మరిచిపోయారు. దీంతో ఆ మహిళ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కాటన్ కడుపులో పాయిజన్‌గా మారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మమత మృతి చెందింది. వైద్యులు మమత కడుపులోంచి కాటన్‌ను వెలికి తీశారు. ఘటనకు బాధ్యులైన కేకే నర్సింగ్ హోమ్ ముందు మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption