Abn logo
Sep 28 2021 @ 09:07AM

యాదాద్రిలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ..రాకపోకలకు అంతరాయం

యాదాద్రి-భువనగిరి: భారీ వర్షాల కారణంగా జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీబీనగర్ - భూదాన్ పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెళ్లి వద్ద మూసి ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి మండలం అనాజీపూర్ - రావిపహాడ్ వెళ్లే దారిలో చిన్నెటివాగు పొంగిపొర్లడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రాయగిరి వద్ద సర్వీస్ రోడ్డు మూసివేశారు. యాదగిరిగుట్ట, మోత్కూర్ ఆత్మకూర్, తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. బొల్లెపల్లి - సంగెo మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భీమలింగం కత్వా వద్ద బ్రిడ్జి మీద నుంచి మూసీ ప్రవహిస్తోంది. 

ఇవి కూడా చదవండిImage Caption