యాదాద్రి పునర్నిర్మాణ పనులు భేష్‌: సీఎం

ABN , First Publish Date - 2021-03-05T06:34:59+05:30 IST

యాదాద్రి పునర్నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్‌ వైటీడీఏ అధికారులను ప్రశంసించారు. గురువారం సీఎం కేసీఆర్‌ యాదాద్రిని సందర్శించిన సమయంలో బ్రాస్‌, అల్యూమినియం లోహాల మిశ్రమంతో రూపొందించిన క్యూలైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు

యాదాద్రి పునర్నిర్మాణ పనులు భేష్‌: సీఎం
సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచనం అందజేస్తున్న అర్చకులు

 యాదాద్రి టౌన్‌, మార్చి 4: యాదాద్రి పునర్నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్‌ వైటీడీఏ అధికారులను ప్రశంసించారు. గురువారం సీఎం కేసీఆర్‌ యాదాద్రిని సందర్శించిన సమయంలో బ్రాస్‌, అల్యూమినియం లోహాల మిశ్రమంతో రూపొందించిన క్యూలైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు. 8అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 12అడుగుల ఎత్తులో ఒక్క క్యూలైన్‌ బాక్సు రానుందని, ఈ క్యూబాక్స్‌లు గుడిసె ఆకారాన్ని పోలినట్టుగా, శంకుచక్ర నా మాలతో ఆగమ శాస్త్రాన్ని అణువణువునా ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిం చే విధంగా క్యూలైన్‌ నిర్మాణం జరుపుతున్నట్లు వైటీడీఏ అధికారులు పేర్కొ న్నారు. ఈ తరహా క్యూ లైన్ల నిర్మాణం దేశంలో మరెక్కడా లేదని సీఎం కేసీ ఆర్‌కు వివరించారు. దీంతో ఆయన అధికారుల పనితీరును ప్రశంసించారు. 

స్వామికి ఘనంగా నిత్యారాధనలు 

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యవిధి కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామికి సుప్రభాతంతో ఆరంభమైన నిత్య  పూజలు రాత్రివేళ శయనోత్సవ వేడుకలతో ముగిశాయి. బాలాలయంలో అభిషేకం అర్చనలు హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. శివాలయంలో రామలింగేశ్వరుడిని ఆరా ధించిన అర్చకులు ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహిం చారు. స్వామికి గురువారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.6,57,273 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 

 మార్చి చివరకు విస్తరణ పనులు పూర్తి కావాలి: విప్‌ సునీత 

 మార్చి చివరి కల్లా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసే దిశలో అధికారులు దృష్టిసారించాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆలయ విస్తరణ పనులు సంతృప్తికరంగానే సాగు తున్నాయన్నారు. మార్చి నెల చివరి నాటికి అన్ని పనులూ పూర్తి చేయాలని అధికారులను అదేశించినట్లు తెలిపారు. మే నెలలో మంచి సుముహూర్తాలు ఉన్నందున ఆలయ ఉద్ఘాటన జరిపే అవకాశం ఉందన్నారు. కొండకింద క ల్యాణకట్ట పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినట్లు తెలిపారు. ఈ నెల చివరి కల్లా కల్యా ణకట్ట పనులు పూర్తి చేసేందుకు ఆదేశించినట్లు తెలిపారు. రహదారి విస్త రణ బాధితులకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించాడని పేర్కొన్నారు. 

గుట్టలో సీఎంకు ఘనస్వాగతం

యాదాద్రి రూరల్‌: సీఎం కేసీఆర్‌కు గురువారం గుట్టలో హెలిక్యాప్టర్‌ దిగగానే రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. వారితో పాటుగా ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌,  మునిసిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధబీరయ్య ఉన్నారు. 

 సీఎం చిత్రపటానికి  క్షీరాభిషేకం

  పట్టణంలో రోడ్డు విస్తరణ బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఇల్లు కోల్పోయిన ఇల్లు, షాపు కోల్పోయిన వారికి షాపు ఇస్తానని సీఎం ప్రకటిం చారు. దీంతో బాధితులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  

‘పీఏసీఎస్‌ చైర్మన్లకు గౌరవవేతనం రూ. 25వేలు ఇవ్వాలి’

 రాష్ట్ర వ్యాప్తంగా పీఏసీఎస్‌ చైర్మన్లకు ఇచ్చే గౌరవ వేతనం రూ.1250 నుంచి రూ. 25వేలు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్‌  గొంగిడి మహేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈమేరకు గుట్టలో సీఎంకు వినతిపత్రం అంద టజేశారు. ఈ విషయమై సీఎం సానుకూలంగా స్పందించినట్లు మ హేందర్‌రెడ్డి తెలిపారు.

 గుట్ట మునిసిపల్‌ నూతన భవన నిర్మాణం కోసం మునిసిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌ సీఎం వద్ద ప్రస్తావించారు. వెంటనే స్పందించి  ప్రభుత్వ విప్‌గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని, సంబంధిత అధికారులను పిలిచి వెంటనే నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. భవనం స్వామి వారి ఆలయాన్ని పోలిన విధంగా గోపురాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన ఇలా..

 మధ్యాహ్నం 12.07గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా హైదారాబాద్‌నుంచి యాదాద్రిక్షేత్రానికి అభిముఖంగా ఉన్న పెద్దగుట్టపైకి సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు.

 12.22గంటలకు కొండపైకి వచ్చిన సీఎంకు దేవస్థాన అర్చక, అధికారబృందం స్వాగతం పలికింది.

 12.27గంటల వరకు బాలాలయంలో సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తుల చెంత పూజల్లో సీఎం పాల్గొన్నారు. 

 12.42గంటలకు ప్రధానాలయ ఉత్తర దిశలోని హరిహరుల నామ నక్ష త్రాల చెట్లను, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులను పరిశీలించారు.  ఆలయ విస్తరణ పనులు, లోహపు క్యూలైన్లు, బ్రహ్మోత్సవ మండపాన్ని పరిశీలించారు.

 12.54గంటలకు దక్షిణ దిశలో ఎల్‌ఈడీ లైటింగ్‌, తూర్పు రాజగోపురం ముందు ఏర్పాటు చేసిన ఇత్తడి క్యూలైన్లను పరిశీలించారు.

 12.58 నుంచి ప్రధానాలయంలో శిల్పి నిర్మాణాలు, దర్శన క్యూలైన్ల పనులు, అర్చకులతో ఆగమ సంబంధిత కార్యక్రమాల నిర్వహణపై సుమారు 50 నిముషాల పాటు చర్చించారు.

 1.56 గంటలకు వరకు శివాలయానికి చేరుకొని అక్కడి పనులను పరిశీలించి పూజల్లో పాల్గొన్నారు. శివాలయ పునర్నిర్మాణ పనులను, కొండకింద రహదారి, మెట్ల మార్గం పనులపై అధికారులను ఆరా తీశారు.

 2.25గంటలకు హరితకాటేజ్‌లో భోజనం అనంతరం విశ్రాంతి తీసుకున్నారు.

 3.25గంటలకు ప్రధానాలయ ప్రాంతానికి చేరుకొని శివాలయం, దర్శన క్యూలైన్లు, విష్ణుపుష్కరిణి తదితర ప్రాంతాలోల్లో పర్యటించారు.

 4.07గంటలకు గండిచెరువు సమీపంలోని నూతన బస్టాండ్‌ ప్రాంతానికి చేరుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు అన్నప్రసాద వితరణ భవనం, కల్యాణ కట్ట, వ్రతమండపం, పుష్కరిణి తదితర అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.

 4.27గంటలకు రహదారి నిర్వాసితులో గంట పాటు సమావేశమయ్యారు.

 సాయంత్రం 5.25గంటలకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌, విల్లాల నిర్మాణాలను పరిశీలించారు.

ఫ 5.55 గంటలకు పెద్దగుట్టపై హెలీప్యాడ్‌కు చేరుకొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

- యాదాద్రి టౌన్‌


యాదాద్రి ఆలయం అద్భుతం

 హెచ్‌ఆర్‌సీ చైర్మెన్‌ జస్టీస్‌ చంద్రయ్య

యాదాద్రి, మార్చి4(ఆంధ్రజ్యోతి): యాదాద్రి ఆలయ పుననిర్మాణం అద్భుతంగా ఉందని మానవహక్కుల కమిషన్‌ చైర్మెన్‌ జస్టీస్‌ జి. చంద్రయ్య  అన్నారు. గురువారం ఆయన యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అభివృద్ది పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌ను కలుసుకోగా ఆయన అభివాదం చేశారు. ఆయన వెంట రాష్ట్ర ఆర్ధిక సంస్థ చైర్మెన్‌ జి. రాజేశం గౌడ్‌ పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం: సీపీఐ 

 యాదాద్రి టౌన్‌: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర సందర్శనకు విచ్చేసే భక్తుల మౌలిక సదుపాయాల కల్పనపై నిర్లక్ష్యం వహిస్తున్న ఈవోపై చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్‌  మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా మరో వైపు భక్తులకు ఎలాంటి వసతి సౌకర్యాల కల్పన లేకపోవడంతో తీవ్ర  ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కొండపైన కనీసం టాయిలెట్స్‌, తాగునీటి సౌక ర్యాలు సైతం కల్పించకపోవడం శోచనీయమని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ సుధాకర్‌, మహిళా నాయకురాలు బండి జంగయ్య, ఆరె పుష్ప ఉన్నారు. 


Updated Date - 2021-03-05T06:34:59+05:30 IST