రేపటి నుంచి యాదాద్రిలో శ్రావణమాస పూజలు

ABN , First Publish Date - 2021-08-09T00:58:05+05:30 IST

ప్రసిద్ధ యాదాద్రి క్షేత్రంలో సోమవారం నుంచి శ్రావణమాస పూజలు నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ స్వామి సన్నిధిలో శ్రావణ మాస విశేష మహోత్సవాలను నిర్వహించనున్నట్టు

రేపటి నుంచి యాదాద్రిలో శ్రావణమాస పూజలు

యాదాద్రి: ప్రసిద్ధ యాదాద్రి క్షేత్రంలో సోమవారం నుంచి శ్రావణమాస పూజలు నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ స్వామి సన్నిధిలో శ్రావణ మాస విశేష మహోత్సవాలను నిర్వహించనున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఆండాల్‌ అమ్మవారి తిరు నక్షత్ర వేడుకలు, 13న నాగుల పంచమి, గరుడ పంచమి, సుదర్శన ఆళ్వార్‌ తిరునక్షత్రం, 15న స్వామి జన్మ నక్షత్రం స్వాతి వేడుకలు, 17నుంచి 19వ తేదీవరకు పవిత్రోత్సవాలు, 18న ఏకాదశి లక్ష పుష్పార్చనలు, 22న రాఖీ పౌర్ణమి, 29న స్మార్త కృష్ణాష్టమి, 31న శ్రీవైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 3వ తేదీన ఏకాదశి లక్షపుష్పార్చనలు సంప్రదాయరీతిలో నిర్వహిస్తారు. శ్రావణ మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రంతో పాటు జిల్లాలోని అన్ని దేవాలయాల్లో భక్తుల వ్రతాలు, సామూహిక కుంకుమార్చనలు, వరలక్ష్మీ, మంగళగౌరి వ్రతాలతో ఆధ్యాత్మికతను సంతరించుకోనుంది.

Updated Date - 2021-08-09T00:58:05+05:30 IST