Abn logo
Jun 3 2021 @ 08:37AM

యాదాద్రి బాలాలయంలోకి వర్షపు నీరు

యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహస్వామి బాలాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరాయి. భారీగా నీరు చేరడంతో బాలాలయం చెరువును తలపిస్తోంది. కాగా...అర్చకులు వర్షపు నీటిలోనే కుర్చీలు వేసుకుని నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైవుంది. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న వడ్లను అధికారులు కాంట తీసుకుపోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.