యాజమాన్య పద్ధతులు పాటిస్తే పత్తిలో లాభాలు

ABN , First Publish Date - 2022-01-29T04:14:57+05:30 IST

యాజమాన్య పద్ధతులు పాటిస్తే పత్తిలో అధిక దిగుబడులు సాధించి, లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి వాసు పేర్కొన్నారు.

యాజమాన్య  పద్ధతులు  పాటిస్తే పత్తిలో లాభాలు
పత్తి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

పొదలకూరురూరల్‌, జనవరి 28 : యాజమాన్య పద్ధతులు పాటిస్తే పత్తిలో అధిక దిగుబడులు సాధించి, లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి వాసు పేర్కొన్నారు. మండలంలోని మహమ్మదాపురం, ప్రభగిరిపట్నం, బిరదవోలు, ఇనుకుర్తి, డేగపూడి గ్రామాల్లో 500 ఎకరాల్లో వరికి ప్రత్యామ్నాయంగా పత్తిసాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి క్వింటా ధర రూ.10వేలు పలుకుతోంది. 


ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 120 కిలోలు, 50కిలోల డీఏపీ ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. వీటిని మొక్క 20రోజుల వయస్సుకు 30కిలోల యూరియా, 12 కిలోల పొటాష్‌తో కలిపి మొక్క మొదళ్ల వద్ద వేసుకోవాలి. ఇదేవిధంగా మొక్కలు 40 రోజుల వయస్సు, 60రోజులు, 80 రోజుల వయస్సులో వేసి తేలికపాటి నీటి తడి ఇవ్వాలి.


జింక్‌ లోప నివారణ : మొక్క మొలిచిన 20 రోజులకు ఒకసారి 40 రోజులకు జింక్‌ సల్ఫేట్‌ 12శాతం పిచికారీ చేయాలి. దీనివల్ల జింక్‌ లోప నివారణ సాఽధ్యమవుతుంది. 


సస్యరక్షణ : రైతులందరూ బీటీ పత్తిని సాగు చేయడం వలన కాయతొలుచు పురుగుల ఉధృతి కనిపించడం లేదు. రసం పీల్చు పురుగులు, తామర, పిరికినల్లి, పేనుబంక వంటి పురుగులు ఆశించి పైరును పెరగకుండా చేస్తోంది. వీటి నివారణకు ఇమిడో క్లోరైడ్‌ ఒక ఎంఎల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని ఏవో సూచించారు. 






 

Updated Date - 2022-01-29T04:14:57+05:30 IST