యమహా ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌

ABN , First Publish Date - 2021-06-19T05:45:22+05:30 IST

జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం యమహా.. భారత మార్కెట్లోకి ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌ ను తీసుకువచ్చింది. రెండు వేరియంట్లతో లభించనున్న ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.1,16,800 (ఢిల్లీ

యమహా ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం యమహా.. భారత మార్కెట్లోకి ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌ ను తీసుకువచ్చింది. రెండు వేరియంట్లతో లభించనున్న ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.1,16,800 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). 4 స్ట్రోక్‌, 149 సీసీ ఇంజన్‌, ఎయిర్‌కూల్డ్‌ ఈ బైక్‌ ప్రత్యేకతలు. కొత్త ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌... యమహా తొలి నియో రెట్రో (మోడర్న్‌ టెక్నాలజీ, క్లాసిక్‌ పాత తరం డిజైన్‌) మోటార్‌సైకిల్‌ అని పేర్కొంది. కాగా బ్లూటూత్‌ ఎనేబుల్డ్‌తో కూడిన బైక్‌ ధర రూ.1,19,800. యమహా వై- కనెక్ట్‌ యాప్‌తో ఈ బైక్‌ను బ్లూటూత్‌ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. బైక్‌ మెయింటెనెన్స్‌ విరాలు, చివరి పార్కింగ్‌ ప్రాంతం ట్రాక్‌ చేయటం, ఇంధన వినియోగం వంటి వాటిని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.

Updated Date - 2021-06-19T05:45:22+05:30 IST