Abn logo
Oct 14 2021 @ 21:16PM

హద్దులు దాటి అప్పులు: యనమల

తూర్పుగోదావరి: నవరత్నాల పేరుతో జగన్‌ ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధే తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం హద్దులు దాటి అప్పులు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల భారం ప్రజలపైనే పడుతుందని చెప్పారు. ప్రభుత్వం విపరీతంగా దుబారా ఖర్చులు చేస్తోందని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు తీర్చే పరిస్థితులు కన్పించట్లేదని చెప్పారు. రాష్ట్రం అంధకారంలో ఉందని మండిపడ్డారు. రూ.41 వేల కోట్లకు లెక్కలు చెప్పట్లేదని, అధికశాతం వడ్డీకి రుణాలు తెస్తున్నారని పేర్కొన్నారు. రహదారులపై గుంతలు పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. పాలనపై జగన్‌కు అవగాహన లేదన్నారు. అప్పులు తెచ్చిన డబ్బులు ఏంచేస్తున్నారో అర్థంకావట్లేదని వ్యాఖ్యానించారు. 

ఇవి కూడా చదవండిImage Caption