అమరావతి: మహిళలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే..జెండర్ బడ్జెట్ గారడీ అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అమ్మఒడి, ఆసరా, చేయూత మోసంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేయూతలో ఒక్కో మహిళకు రూ.1.05 లక్షల ద్రోహం జరిగిందన్నారు. అమ్మఒడి సొమ్మును నాన్న బుడ్డీలో లాక్కోవడం మోసం కాదా? అని ప్రశ్నించారు.