Abn logo
Jan 26 2021 @ 00:26AM

అడ్డగోలుగా వ్యవహరిస్తే పతనం తప్పదు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని 


దాచేపల్లి, జనవరి25: ప్రజాస్వామ్యంపై అడ్డగోలుగా వ్యవహరిస్తే పతనం తప్పదని  మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం  రామాపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో యరపతినేని మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అమలు  చేయాలి  కానీ.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలన్నారు. గతంలో పోలీసులను అడ్డం పెట్టుకొని నిర్వహించిన ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  ఎన్నికల కమిషన్‌ను దుర్భాషలాడారని ఇటువంటి వ్యక్తులు పాలకులుగా ఉండటం మన దురదృష్టకరమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

     

Advertisement
Advertisement
Advertisement