Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ ప్రభుత్వంపై యరపతినేని ఫైర్

గుంటూరు: టీడీపీ హయాంలో పార్టీలతో పనిలేకుండా పథకాలు అమలు చేశామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుర్తుచేశారు. వైసీపీ పాలనలో  ఇతర పార్టీల వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో నేరుగా ఇంటికే మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు తెలంగాణా మద్యాన్ని ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు మట్టి, మద్యం, ఇసుక, గంజాయి, గుట్కా, రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమ వ్యాపారాలేవి పోలీసులకు కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా మార్చివేశారని మండిపడ్డారు. పరిపాలన చేతగాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూస్తున్నామన్నారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు జైలుకు పోతాడో తెలియని అస్తవ్యస్థ పరిస్థితి నెలకొందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చిందన్నారు. అక్రమాస్తుల కేసులో ఎంతమంది అధికారులు జైలుకెళ్లారో గుర్తెరగాలన్నారు. ఇపుడు జగన్ మాటలు వింటే రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితే వస్తుందన్నారు. తాము అధికారంలోకి రాగానే అన్నింటిపైనా విచారణ జరుపుతామన్నారు. 

Advertisement
Advertisement