నాయనమ్మతో కలసి మిఠాయిల వ్యాపారం... 8 నెలల్లో రూ. 4 లక్షల ఆదాయం!

ABN , First Publish Date - 2021-03-30T16:17:58+05:30 IST

దేశంలో గతంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా...

నాయనమ్మతో కలసి మిఠాయిల వ్యాపారం... 8 నెలల్లో రూ. 4 లక్షల ఆదాయం!

కోల్‌కతా: దేశంలో గతంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారు. అయితే కొందరు ఇదే సమయంలో తమ వినూత్న ఐడియాలతో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు కోల్‌కతాకు చెందిన యాషీ చౌదరి, ఆమె నాయనమ్మ మంజూ పోద్దార్. యాషీ చౌదరి గత ఏడాది తన నాయనమ్మతో పాటు ఇంటి నుంచే మిఠాయిల వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు వారి వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. 


 ప్రస్తుతం వారు అమెరికాకు కూడా మిఠాయిలను ఎగుమతి చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రతీ నెలా సుమారు 200కుపైగా ఆర్డర్లను వీరు అందుకుంటున్నారు. కేవలం 8 నెలల వ్యవధిలో వీరిద్దరూ నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని అందుకున్నారు. 21 ఏళ్ల యాషీ లండన్‌లో మాస్టర్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నేను నాయనమ్మ దగ్గరకు వచ్చాను. మా నాయనమ్మ పిండి వంటలు బాగా చేస్తుంది. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త వంటకం చేస్తుంటుంది. ముఖ్యంగా నాయనమ్మ చేసే మిఠాయిలంటే నాకెంతో ఇష్టం. దీనిని కమర్షియల్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఇది ఛాలెంజిగ్‌గా అనిపించినప్పటికీ, ఇంటి నుంచే చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించాం. మొదట్లో కొన్ని మిఠాయిలు తయారు చేసి, మాకు తెలిసిన వారికి విక్రయిస్తూ వచ్చాం. మా వ్యాపారం మెల్లమెల్లగా పెరగసాగింది. దీంతో మేము మిఠాయిల డెలివరీ స్థాయిని కూడా పెంచాం. ముఖ్యంగా పండగల సీజన్‌లో మిఠాయిలకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకుని, మా వ్యాపారాన్ని మరింత విస్తృతం చేశాం. అయితే ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మార్కెట్‌ను స్టడీ చేసి ముందుకు సాగాలన్నారు. 

Updated Date - 2021-03-30T16:17:58+05:30 IST