Jun 17 2021 @ 20:57PM

చిరిగిన జీన్స్‌ దుస్తుల్లో యాషికా ఆనంద్‌

ఈ మధ్యకాలంలో సినీప్రముఖులతో పాటు హీరోహీరోయిన్లు చిరిగిపోయిన జీన్స్‌ దుస్తులు ధరించడం ఓ ఫ్యాషనైపోయింది. ఈ ఫ్యాషన్‌ ట్రెండ్‌ ఇపుడు తారాస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ యాషికా అనంద్‌ ఈ ట్రెండ్‌లో పూర్తిస్థాయిలో మునిగిపోయింది. ఇప్పటివరకు ఆమె ధరించని దుస్తుల్లో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ధరించిన దుస్తుల్లో గ్లామర్‌ మోతాదు శృతిమించిపోయిందని చెప్పొచ్చు. పైగా ఈ గ్లామర్‌ దుస్తుల్లో ఆమె షేర్‌ చేసిన ఫొటోలు కూడా నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అయితే, ఆమె ధరించిన దుస్తులపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్‌ చేస్తున్నారు. కొన్ని దేశాల్లో చిరిగిపోయిన దుస్తులు ధరించడం ఓ ఫ్యాషన్‌. కానీ, మన దేశంలో ఇలాంటి దుస్తులు ధరించడం న్యాయమా..? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.