ఫ్యాను గుర్తుపై స్లిప్పుల పంపిణీ

ABN , First Publish Date - 2021-03-02T06:33:21+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పటమట 13వ డివిజన్‌లో వైసీపీ నాయకులు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారు.

ఫ్యాను గుర్తుపై స్లిప్పుల పంపిణీ

పటమట, మార్చి 1: మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పటమట 13వ డివిజన్‌లో వైసీపీ నాయకులు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారు. రెండు రోజుల నుంచి రాత్రి సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించకుండా వైసీపీ ఎన్నికల గుర్తు (ఫ్యాను) ముద్రించి ఉన్న ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేయడం వివాదస్పదమవుతోంది. డివిజన్‌లోని ఎలక్ర్టిసిటీ కాలనీ 5, 6వ రోడ్లలో ఇది జరిగింది.    దీనిపై సోమవారం టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ముమ్మనేని ప్రసాద్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

 ఎన్నికల నియమావళిని పాటించలేదు : ఆర్వో

ఎన్నికల నియమావళికి సంబంధించిన బుక్‌లెట్‌లను ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులకు అందించామని, అందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఓటరు స్లిప్పులో ఓటరు పేరు మినహా పార్టీ గుర్తు ముద్రించి స్లిప్పులు పంపిణీ చేయకూడదని, దీనిపై  పూర్తి ఆధారాలు లభ్యమైతే చర్యలు తీసుకుంటామని 13వ డివిజన్‌ ఎన్నికల రిటర్నింగు అధికారి దుర్గారావు తెలిపారు. 


Updated Date - 2021-03-02T06:33:21+05:30 IST