బాలకృష్ణ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ

ABN , First Publish Date - 2021-03-08T23:39:07+05:30 IST

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ

బాలకృష్ణ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ

అనంతపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. హిందూపురంలోని మోత్కుపల్లిలో ప్రచారానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లారు. అక్కడ బాలకృష్ణ ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మోత్కుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జై జగన్ నినాదాలు చేస్తూ బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డగించారు. వైసీపీ కార్యకర్తలకు మద్దతుగా ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ మోత్కుపల్లి వచ్చారు. 

Updated Date - 2021-03-08T23:39:07+05:30 IST