Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖలో వైసీపీ నేతలకు ఓణీల ఫంక్షన్

విశాఖ:  సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీని ఉద్దేశించి నగర తెలుగు మహిళలు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు. అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఐదుగురి మహిళల ముఖాలకు సీఎం జగన్, విజయసాయిరెడ్డి, కొడాలి, అంబటి, వంశీ ఫొటోలు తగిలించి, వారికి ఆకులు, వక్కలు, జాకెట్ ఇచ్చి తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మహిళను కించపర్చిన జగన్, విజయసాయిరెడ్డి, నాని, అంబటి, వంశీ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ప్రతి రోజూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తామని తెలుగు మహిళలు హెచ్చరించారు. Advertisement
Advertisement