Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డుపై బైఠాయించిన వైసీపీ కార్పొరేటర్

గుంటూరు: నగరపాలక సంస్థ అధికారుల తీరుపై వైసీపీ కార్పొరేటర్ ఆచారి నిరసన తెలియజేశారు. శనివారం ఆయన రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఆక్రమణల పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొందరినే టార్గెట్ చేస్తూ పని చేస్తున్నారని చెప్పారు. దీంతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. డిప్యూటీ సిటీ ప్లానర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement