నెల్లూరు జిల్లా కోర్టు వద్ద వైసీపీ ఫ్లెక్సీ

ABN , First Publish Date - 2020-06-05T17:10:30+05:30 IST

జిల్లాలో న్యాయస్థానాలకు వైసీపీ రంగులు పులిమే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నెల్లూరు జిల్లా కోర్టు వద్ద వైసీపీ ఫ్లెక్సీ

నెల్లూరు: జిల్లాలో న్యాయస్థానాలకు వైసీపీ రంగులు పులిమే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ జిల్లా కోర్టు మెయిన్ గేటు వద్దనే భారీ వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు ఫ్లెక్సీ ఏర్పాటు చట్టవిరుద్ధమని అంటున్నారు. న్యాయవ్యవస్థనే అపహాస్యం చేసేలా జిల్లా కోర్టు మెయిన్ గేటు గోడకు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-05T17:10:30+05:30 IST