అభివృద్ధి మరచి అరాచకాలు సాగిస్తున్న వైసీపీ: కాలవ

ABN , First Publish Date - 2022-01-18T06:08:03+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని మరచి, అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించా రు.

అభివృద్ధి మరచి అరాచకాలు సాగిస్తున్న వైసీపీ: కాలవ
డీ హీరేహాళ్‌ మండల గౌరవ సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

డీ హీరేహాళ్‌, జనవరి 17: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని మరచి, అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించా రు. మండలంలోని కాదలూరు, దొడఘట్ట గ్రామాల్లో సోమవారం నిర్వహించిన టీడీపీ గౌరవసభల్లో ఆయన మాట్లాడారు. అసమర్థ పాలనతో రాషా్ట్రన్ని అధోగ తి పాలు చేస్తున్న సీఎం జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని ధ్వ జమెత్తారు. ఎన్నికల ముందు ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు బూటకపు హామీలిచ్చిన జగన, గద్దెనెక్కిన తరువాత నట్టేట ముంచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కు జీతాలు రాని పరిస్థితి నెలకొందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా వుందన్నారు. గ్రామాల్లో వైసీపీ నాయకుల అరాచకాలు మితిమీరాయన్నారు. రా యదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అభివృద్ధి మరచి, తన అక్రమార్జన కోసం గ్రామాల్లో వైసీపీ నాయకులతో మద్యం, ఇసుక దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఏ గ్రామానికి వెళ్లినా కర్ణాటక మద్యం ఏరులై పా రుతోందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్పా, వైసీపీ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడా గ్రామాల్లో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. 

          

  గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో వున్నప్పుడు రాయదుర్గం ని యోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. అలాంటి నన్ను, ప్రజల కష్టాలను గాలికొదిలేసిన  ఎమ్మెల్యే కాపు, వైసీపీ నాయకులు విమర్శిస్తుంటే... గ్రామాల్లో సామాన్య ప్రజలు వారి మొహాన ఉమ్ముతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ హనుమంతరెడ్డి, మాజీ ఎంపీపీ కాదలూరు మోహన రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గంగాధర, మొండి మల్లికార్జున, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, మండల కన్వీనర్‌ బలరామిరెడ్డి, పులకుర్తి మంజు, దొడఘట్ట రామాంజనేయు లు, తిప్పేస్వామి, మల్లికార్జున, శంకర్‌, హనుమంతు, నారాయణ స్వామి, వెంకటేశులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


వైసీపీది దుర్మార్గ పాలన:

జితేంద్రగౌడ్‌, వెంకట శివుడు యాదవ్‌ 

గుత్తి రూరల్‌ : రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలన నడుస్తోందని మాజీ ఎ మ్మెల్యే జితేంద్రగౌడ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ విమర్శిం చారు. సోమవారం మండలంలోని జక్కలచెరువు గ్రామంలో సోమవారం నిర్వ హించిన టీడీపీ గౌరవ సభలో వారు మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితి ఎటు చూసి నా అప్పులు పుట్టక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతోందన్నారు. ఇంతాచేసి ఉద్యోగులకు జీతాలు సక్రమగా ఇవ్వలేని సీఎం జగన చేతకాని పాలన చేస్తున్నారన్నారు. పేదలపై ఓటీఎస్‌ పేరుతో ఒత్తిడి తెస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన చేస్తామన్నారు. సీఎం జగన అ పద్దాల హామీలిచ్చి అన్నీ చేశామని గొప్పగా చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో టీ డీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు కేసీ హరి, మండల, పట్టణ కన్వీనర్లు బ ర్దీవలి, రవిశంకర్‌ గౌడు, మాజీ ఎంపీపీ వీరేష్‌, టౌన బ్యాంకు అధ్యక్షుడు జిలాన, సర్పంచ భరత కుమార్‌, ఎంపీటీసీ సభ్యులు జింకల నారాయణ స్వామి, ధ నుంజయ, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్లు గుమ్మనూరు వెంకటేష్‌, శ్రీనివాస యాదవ్‌, మాజీ సర్పంచలు వెంకట నారాయణమ్మ, వెంకటరాముడు, శ్రీనివాస చౌదరి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకట నారాయణ, నాయకులు రంగారెడ్డి యాదవ్‌, దిల్‌కాశీన, శ్రీకాంత, చిన్నరెడ్డి యాదవ్‌, టౌనబ్యాంకు ఉపాధ్యక్షుడు కృష్ణా, రామాంజనేయులు, రమేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T06:08:03+05:30 IST