Advertisement
Advertisement
Abn logo
Advertisement

బావిలో కప్పలా మారిన వైసీపీ ప్రభుత్వం: సత్యకుమార్

అమరావతి: ఒక్కసారి అవకాశం అంటూ వైసీపీ గద్దెనెక్కి పరిపాలన చేతకాక.. కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తప్పుబట్టారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడడం, కోర్టులో చివాట్లు తినడం.. ప్రజలను మభ్యపెట్టడం వైసీపీ దినచర్యగా మారిందని ట్విటర్‌లో సత్యకుమార్‌ దుయ్యబట్టారు. ప్రభుత్వ చేతకానితనం ప్రజలకు శాపంగా మారిందన్నారు. బావిలో కప్పలా మారిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రం దాటొచ్చి దేశంలో రోడ్లు చూడాలన్నారు. దేశంలో ఎక్కడా వర్షాలు పడలేదా.. రోడ్ల మరమ్మతులు జరగడం లేదా? అని సత్యకుమార్ ప్రశ్నించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement