Abn logo
Sep 26 2021 @ 00:24AM

ఎగుమతుల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం

వాణిజ్య ఉత్సవ్‌లో మంత్రి శంకరనారాయణ

అనంతపురం కార్పొరేషన,సెప్టెంబరు 25: ఎగుమతుల విషయంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేద్దామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. శనివారం జి ల్లా పరిశ్రమల కేంద్రం(డీఐసీ), ఏపీఐఐసీ ఆధ్వర్యంలో శిల్పారామంలో వాణిజ్య ఉత్సవ్‌ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి శంకరనారాయణ, ఏపీఐఐసీ చైర్మన మెట్టుగోవిందరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 21 నుంచి 26వరకు దేశ వ్యాప్తంగా వాణిజ్యఉత్సవ్‌ జరుపుతున్నారన్నారు. ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ చౌకగా ఎగుమతుల నిర్వహణకు రాష్ట్రంలోని అవకాశాలను ఎగుమతిదారులకు వివరించాలన్నారు. రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు సరుకు ఎగుమతులకు సింగిల్‌ డెస్క్‌ ద్వారా అనుమతులు పొందటానికి పారిశ్రామికవేత్తలు ఎక్స్‌పోర్ట్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని పరిశ్రమల శాఖ కల్పించిందన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 20 వస్తు ప్రదర్శనశాలను, ఉత్పత్తులను మంత్రి, ఏపీపీఐసీ చైర్మన, ఎంపీలు, ఎమ్మెల్యే ప్రారంభించారు. 85మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు 20 స్టాళ్లలో వివిధ పరిశ్రమలలో తమ ఉత్పత్తులు ప్రదర్శించారు.