కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైసీపీ అరాచకం

ABN , First Publish Date - 2021-11-23T02:27:45+05:30 IST

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైసీపీ అరాచకం సృష్టించింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సమక్షంలోనే వైసీపీ సభ్యులు

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైసీపీ అరాచకం

విజయవాడ: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైసీపీ అరాచకం సృష్టించింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సమక్షంలోనే వైసీపీ సభ్యులు విధ్వంసం సృష్టించారు. ఎంపీ కేశినేని నాని, టీడీపీ వార్డు సభ్యుల్ని భయబ్రాంతులకు గురిచేశారు. సమావేశ హాల్‌లోని కుర్చీలు, రిటర్నింగ్‌ అధికారి వేదికను ధ్వంసం చేశారు. రిటర్నింగ్‌ అధికారిని వైసీపీ సభ్యులు  కొట్టినంత పని చేశారు. వైసీపీ సభ్యుల విధ్వంస దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.


కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి  వివరణ ఇచ్చారు. వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత.. ఎజెండా సంబంధించిన అంశాలను సభ్యులకు వివరించానని నారాయణరెడ్డి తెలిపారు. వైసీపీ వార్డు సభ్యులు హాల్‌లో అలజడి సృష్టించారని, ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మెటీరియల్‌, రిటర్నింగ్‌ అధికారి వేదిక.. అటెండెంట్స్‌ షీట్స్‌, మినిట్స్‌ రిజిస్టర్, విప్‌ ఫామ్స్‌ని చించేశారని తెలిపారు. కేశినేని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఈ కారణాలతో సమావేశాన్ని నిర్వహించలేకపోయానని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు.


Updated Date - 2021-11-23T02:27:45+05:30 IST