వైఎస్సార్‌ సీపీ మహిళా నేత ఇంటిపైప్రత్యర్థి వర్గం దాడి

ABN , First Publish Date - 2021-01-17T06:45:22+05:30 IST

స్వల్ప వివాదంతో ఆగ్రహం చెందిన రౌడీమూకలు ప్రత్యర్థి వర్గం ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించడంతోపాటు పలువురిని గాయపరిచారు.

వైఎస్సార్‌ సీపీ మహిళా నేత ఇంటిపైప్రత్యర్థి వర్గం దాడి
అమలాపురం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ జి సురేష్‌బాబు

 వైసీపీ నేత కేతా భానుతేజ వర్గీయుల దాడి

 మహిళ సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

 బండారులంక దంగేటివారిపాలెంలో ఘటన

 నేదునూరులో ప్రభ ఊరేగింపులో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి

 ఘటనలో అంబాజీపేట ఎస్‌ఐతో సహా పలువురికి గాయాలు


అమలాపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): స్వల్ప వివాదంతో ఆగ్రహం చెందిన రౌడీమూకలు ప్రత్యర్థి వర్గం ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించడంతోపాటు పలువురిని గాయపరిచారు. ఈ ఘటనలో రాష్ట్ర వైఎస్సార్‌ సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి సహా పలువురు గాయపడ్డారు. అమలాపురం రూరల్‌ మండలం బండా రులంక శివారు దంగేటివారిపాలెంలో శుక్రవారం రాత్రి ప్రత్యర్థులపై రాళ్లు, కర్రలు, మారణాయుధాలతోపాటు కారం కూడా చల్లి గాయపరిచారు. ఈ ఘటనలో ప్రత్యర్థి వైసీపీ వర్గానికి చెందిన ఒక యువ నేతతో సహా పలువురిపై శనివారం కేసు నమోదు చేశారు. ఇది వైఎస్సార్‌ సీపీలోని రెండువర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదం ఆ పార్టీకి చెందిన కీలక నేతలకు తలనొప్పిగా మారింది. శుక్రవారం సాయంత్రం పి.గన్నవరం ఇసుక ర్యాంపు వద్ద లారీ, కారు స్వల్పంగా ఢీకొన్న ఘటన ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. లారీల యజమాని అయిన బండారులంకకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతా భానుతేజవి కావ డంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. కారులో ఉన్న కొందరు వ్యక్తులు డ్రైవరుతో గొడవపడ్డారు. దాంతో డ్రైవర్‌ తన యజమాని అయిన భాను తేజతో కారులో ఉన్న వ్యక్తులతో మాట్లాడించాడు. ఆ తరువాత ఏం జరి గిందో తెలియదు గానీ శుక్రవారం రాత్రి 10.30 గంటలు దాటిన తరువాత కేతా భానుతేజతోపాటు మరికొందరు యువకులు దంగేటివారిపాలెంలో ఉన్న శెట్టిబలిజ నాయకుడు కండిబోయిన వెంకటేశ్వరరావు ఇంటి వద్దకు వెళ్లారు. కారులో ప్రయాణించిన యువకులు జరిగిన ఘటనపై శెట్టిబలిజ నేతకు చెప్పేందుకు వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న భానుతేజతో సహా అతని వర్గీయులు మారణాయుధాలు, కర్రలు, రాళ్లతో వారిపై విచక్షణార హితంగా దాడిచేశారు. ఆ సమయంలో శెట్టిబలిజ నేత వెంకటేశ్వరరావు సతీమణి, వైఎస్సార్‌ సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి కండిబోయిన భారతి పై దాడికి దిగారు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి పరిసరాలు రాళ్లు, కర్రలతో నిండిపోయాయి. కారు కూడా ధ్వంసమైంది. ఈ ఘర్షణలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అమలాపురం రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సీహెచ్‌ రాజేష్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేత కేతా భానుతేజతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ మహిళా నేత కండిబోయిన భారతితో సహా పలువురిపై కేతా భానుతేజతో సహా అతని వర్గీయులు చేసిన దాడి ఘటన రాజకీయంగా సంచలన మైంది. ఒకే సామాజికవర్గం లో తలెత్తిన ఈ దాడి నేపథ్యంలో భారతి వర్గానికి చెందిన కొందరు గ్రామ స్తులు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్‌ను కలిసి ఘటన పూర్వా పరాలు, ఇతర వ్యవహారాలను ఆయన ముందుంచినట్టు సమాచారం. 

కోనసీమలో పలుచోట్ల ఘర్షణలు..

జగ్గంతోట ప్రభలతీర్థం సందర్భంగా నేదునూరు ప్రభనుఊరేగింపుగా తీసుకువెళుతున్న సమయంలో బాణాసంచా కాల్చే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దాన్ని పోలీసులు సర్దుబాటు చేశారు. తీర్థం ముగించుకుని ప్రభ గ్రామంలోకి వచ్చే సమయంలో ఇరువర్గాలవారు పర స్పరం రాళ్లు రువ్వుకోవడంతో అంబాజీపేట ఎస్‌ఐ షేక్‌ జానీబాషా సహా పలువురికి గాయాలయ్యారు. ఒక సామాజికవర్గానికి చెందిన పదకొండు మందిపైనా, మరో సామాజికవర్గానికి చెందిన పదమూడు మందిపైనా కేసులు నమోదుచేసి సీఐ సురేష్‌బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు. ముమ్మిడివరం మండలం పల్లివారిపా లెంలో రికార్డింగు డ్యాన్స్‌ సందర్భంగా రెండు సామాజికవర్గాల మధ్య తలె త్తిన ఘర్షణలో ఒక సామాజికవర్గానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు.

Updated Date - 2021-01-17T06:45:22+05:30 IST