Advertisement
Advertisement
Abn logo
Advertisement

వలంటీర్ల జోలికి వస్తే ఖబడ్దార్: ఎంపీడీవోపై వైసీపీ నేత ఫైర్

అనంతపురం: ప్రభుత్వ అధికారులపై వైసీపీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సమక్షంలోనే ప్రభుత్వ అధికారులపై శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. వలంటీర్ల జోలికి వస్తే ఖబడ్దార్ అని ఎంపీడీవోను శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. వలంటీర్లకు కేవలం ఐదు వేలు  మాత్రమే ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఐదు వేల రూపాయలతో మోటార్ సైకిల్ పెట్రోల్, టీ ఖర్చులు కూడా రావడం లేదన్నారు. అలాంటి వలంటీర్లపై లేనిపోని అభాండాలు వేసి సస్పెండ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ ఎంపీడీవో‌ను శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.


" నీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. పబ్లిక్ సర్వెంట్ వలంటీర్ల జోలికి రావద్దు. నాయకుల మాటలు విని వలంటీర్ల జోలికి వస్తే నీ ఉద్యోగం ఊడుతుంది. మీ ఎంపీడీవో కార్యాలయాన్ని చుట్టుముట్టి జరిగిన తప్పులను ఎండగడతాం" అని ఎంపీడీవోను ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. " మీ వసూళ్ళు మీరు చేసుకోండి, లంచాలు తీసుకోండి, కాంట్రాక్టులు మీరు చేసుకోండి, మీ దోపిడీ మీరు చేసుకోండంటూ" అధికారులకు శ్రీనివాస్‌రెడ్డి సలహా ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు వైరలయ్యాయి. Advertisement
Advertisement