Abn logo
May 17 2021 @ 11:24AM

టీడీపీ డైరెక్షన్‌లోనే రఘురామకృష్ణంరాజు విమర్శలు: వైసీపీ నేతలు

విశాఖపట్నం: టీడీపీ డైరెక్షన్ లో రఘు రామకృష్ణంరాజు అసభ్యకరంగా విమర్శలు చేశారని ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త కేకే రాజు, వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వికృత రాజకీయాలు చేస్తూ రఘు రామకృష్ణంరాజుని పావులా వాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ట్రాప్‌లో పడి కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడారన్నారు. క్షత్రేయుడు అంటే రక్షించేవాడని...రెచ్చిగొట్టేవాడు కాదని తెలిపారు. రఘు రామకృష్ణంరాజు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన 420 అని...ఎంపీగా అనర్హుడని దుయ్యబట్టారు. ఆయన అరెస్టుకు ప్రభుత్వానికి  సంబంధం లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement