Abn logo
Sep 28 2021 @ 21:48PM

వైసీపీ నేతల కొత్త దందా.. షాకైన ఇళ్ల లబ్దిదారులు

ఏలూరు: తణుకు మండలం తేతలిలో వైసీపీ నేతలు కొత్త దందా వెలుగులోకి వచ్చింది. గతంలో ఇళ్ల స్థలాలకు లబ్దిదారుల నుంచి 30 వేలు చొప్పున వసూలు చేశారు. అవే స్థలాలను మళ్ళీ వేరేవారికి కేటాయించేలా అధికారుల ద్వారా చర్యలు చేపట్టారు. ఆ విధంగా స్థలాలు పొందిన లబ్దిదారులు ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. వంద స్థలాలకుపైగా కేటాయించారు. విషయం తెలుసుకుని పాత లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు.  ఈ అంశాన్ని తణుకు తహశీల్దార్ దృష్టికి  గ్రామ సర్పంచ్ తీసుకువెళ్ళారు. అయితే సర్పంచ్,  తహశీల్దార్ సంభాషణ ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇవి కూడా చదవండిImage Caption