Abn logo
Mar 9 2021 @ 15:32PM

ప్రేమ పేరుతో వైసీపీ నేత తనయుడు మోసం: రేణుక

అమలాపురం: వైసీపీ నేతల వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ రేణుక అనే ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థిని రోదిస్తూ వేడుకుంటోంది. అమలాపురంలో వైసీపీ నేత చెల్లబోయిన శ్రీనివాసరావు తనయుడు ధనుష్ కృష్ణ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె కన్నీటిపర్యంతమైంది. మంత్రి వేణుగోపాల కృష్ణ అండతో పోలీసులు తనను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయడంలేదని రేణుక ఆరోపించింది. తనకు అన్యాయం జరగడంతో ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో గోడు వెళ్లబోసుకుంది. తనకు జరిగిన అన్యాయం సీఎం జగన్ దృష్టికి వెళ్లాలనే తాను రాజకీయంలోకి వచ్చినట్లు రేణుక తెలిపింది. 


కాగా రేణుక చేసిన ఆరోపణలను డీఎస్పీ మాధవరెడ్డి ఖండించారు. బాధితురాలి ఫిర్యాదుతో 2019లోనే కేసు నమోదు చేశామని హైకోర్టు ఆదేశాలతో నిందితుడిని అరెస్టు చేయలేదని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు. కోర్టు ఉత్తర్వులు రద్దయితే నిందితుడిని అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement