Advertisement
Advertisement
Abn logo
Advertisement

సింపతీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా చంద్రబాబు ప్రవర్తన: Umma reddy

గుంటూరు: అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటనను చంద్రబాబు అంత దూరం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన సీనియారిటీని ఉపయోగించి ఇటువంటి చర్చ జరకూడదని వారించవచ్చి ఉండొచ్చని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళల సంఘటనలు అనేకం జరిగాయన్నారు. రోజా అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా బలవంతంగా గెంటేశారని... అంతర్జాతీయ మహిళా సదస్సుకు వచ్చిన రోజాను అడ్డుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉండి ఇటువంటి వాటిని ఎందుకు నివారించలేకపోయారని ప్రశ్నించారు. ప్రజల్లో సింపతీ కోసం ప్రయత్నించినట్లు చంద్రబాబు ప్రవర్తన ఉందని వ్యాఖ్యానించారు. షర్మిలా కూడా తనపై జరుగుతున్న సోషల్ మీడియా ద్రుష్ప్రాచారంపై పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. అంబటి తాను మహిళను కించపరిచలేదని ఇప్పటికే ప్రకటించారన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 

Advertisement
Advertisement