Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయనగరం వైసీపీ నేతల అరాచకం.. 108కు దారి ఇవ్వకుండా కంచె

విజయనగరం: మెంటాడ మండలం కొండపర్తిలో వైసీపీ గ్రూపు తగాదాలు గ్రామస్తులకు ప్రాణ సంకటంగా మారాయి. పంచాయతీ ఎన్నికల నుంచి రెండు గ్రూపుల మధ్య ఉన్న వైర్యం పతాక స్థాయికి చేరింది. వైసీపీకి చెందిన నలుగురు వ్యక్తులు సర్పంచ్ స్థానానికి పోటీ పడగా బీమారావు అనే వ్యక్తి గెలుపొందారు. దీంతో అప్పలస్వామి వర్గం సర్పంచ్‌పై కత్తిగట్టారు. రెండు వైసీపీ గ్రూపుల మధ్య కొన్నాళ్లుగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సర్ది చెప్పేవాళ్లు ఎవరూ లేకపోవడంతో రెండు వర్గాలు ప్రతీ చిన్న విషయానికి గొడవలకు దిగుతున్నాయి.

మరో అడుగు ముందుకేసిన ఓ వర్గం సర్పంచ్ వర్గాన్ని హెచ్చరిస్తూ ప్రధాన రోడ్డుపై కంచె నిర్మించారు. అటుగా వచ్చిన 108 వాహనానికి కూడా దారి ఇవ్వని పరిస్థితిని కల్పించారు. వైసీపీ నాయకుల అధికార దాహానికి గ్రామస్తులు పడరాని పాట్లు పడుతున్నారని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 


Advertisement
Advertisement