Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఉందా?

అమరావతి: ఏపీ టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పరిస్థితులు వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయాయి. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. తమపై దాడి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. తమ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిని మాత్రం ఇప్పటివరకూ గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఉందా?. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని వైసీపీ ఎందుకంటోంది?. చంద్రబాబు ఏ ప్రయోజనాల కోసం నిరసన దీక్ష చేస్తున్నారు?. మూక దాడులు చేసిన వైసీపీ పోటీ దీక్షలు ఎందుకు చేస్తోంది.?. పట్టాభిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం దాడి చేసిన దుండగులను పట్టుకుందా?.’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement