Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇళ్ల పట్టాల పంపిణీలోనే వైసీపీ నేతలు వేలకోట్లు మింగేశారు: కాలవ

అమరావతి: పేదలకు ఇళ్ల పేరుతో సీఎం జగన్ రెండేళ్లుగా.. శంకుస్థాపనలకే పరిమితమయ్యాడని టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఏటా 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలిస్తానని చెప్పిన జగన్‌.. ఇప్పుడు 30 వేలు ఇస్తామంటున్నాడని చెప్పారు. పేదలకు సొంతంగా ఇళ్లు నిర్మించుకునే శక్తి ఉందా? అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీలోనే వైసీపీ నేతలు వేలకోట్లు మింగేశారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల్లో అవినీతిని నిరూపించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement