Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలి

శింగరకొండలో తెలుగు మహిళల పూజలు 

అద్దంకి, నవంబరు 27 : ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ తెలుగు మహిళలు శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శనివారం పూజలు చేశారు.  వైసీపీ నేతల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సతీమణిపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అద్దంకి నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం శింగరకొండ  ప్రసన్నాంజనేయస్వామి  దేవాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు నాగబోతు సుజాత, పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడపడుచులకు రక్షణ కరువైందన్నారు. ఈ విషయమై ప్రశ్నించిన వారి ఇళ్లకు పోలీసులను పంపి వేధిస్తున్నారని విమర్శించారు. మహిళా శక్తి ఏమిటో సీఎంకు చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు మహిళ అద్దంకి నియోజకవర్గ అధ్యక్షురాలు అన్నంగి మనోహరమ్మ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి అంకం తేజశ్వని,  పంగులూరు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కుక్కపల్ల పద్మ, పిన్నిక భారతి, విక్రం శ్రీదేవి, నాగలక్ష్మి, రజని, జహీరా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement