Abn logo
Sep 20 2020 @ 20:48PM

నంద్యాల సీఐ‌కు వార్నింగ్.. రెచ్చిపోయిన వైసీపీ నేతలు

Kaakateeya

కర్నూలు: నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద  వైసీపీ నేతలు రెచ్చిపోయారు. సీఐ సోమశేఖర్ రెడ్డికి వైసీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి హబీబుల్లా వార్నింగ్ ఇచ్చారు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు హబీబుల్లా వాహనాన్ని ఆపారు. దీంతో హబీబుల్లా ఆగ్రహానికి గురయ్యారు.  ‘‘నా వాహనాన్నే ఆపుతావా?. నీవు క్షమాపణ చెప్పాలి. నీ యూనీఫాం అయినా ఉండాలి. లేదంటే నేను రాజకీయమైనా మానుకోవాలి’’ అని అంటూ సీఐను హబీబుల్లా బెదిరించారు. తన అనుచరులతో కలిసి సీఐతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


Advertisement
Advertisement
Advertisement