Abn logo
Sep 10 2021 @ 18:06PM

పవన్‌కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత.. ఉద్రిక్తత..

చిత్తూరు: చవితి వేడుకల సందర్భంగా జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పవన్‌కళ్యాణ్ ఫ్లెక్సీలను చించివేయడం ఉద్రిక్తతతకు దారితీసింది. వినాయక చవితి సందర్భంగా కార్వేటినగరం మండలం కత్తెరపల్లిలో జనసేన నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే తమ అనుమతి తీసుకోకుండా ఎందుకు ఏర్పాటు చేశారంటూ.. వైసీపీ నాయకులు వాటిని చించేశారని జనసేన నాయకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న..  జనసేన గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ పొన్న యుగంధర్, అక్కడికి చేరుకుని పరిశీలించారు. పవన్‌కళ్యాణ్ బ్యానర్లను చించేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దౌర్జన్యాలపై జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు యుగంధర్ పేర్కొన్నారు.