‘దిశ’.. అంటే ఏంటి?

ABN , First Publish Date - 2021-08-01T08:27:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం..

‘దిశ’.. అంటే ఏంటి?

నివ్వెరపరచిన వైసీపీ ఎమ్మెల్యే!


రాజాం రూరల్‌, జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశ చట్టం, యాప్‌ వినియోగంపై అధికారులు వివిధ రూపాల్లో ప్రచారం కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ కూడా.. దిశ యాప్‌, చట్టం, పోలీసు స్టేషన్లపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అయితే.. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే ‘‘దిశ’ అంటే ఏంటి? నాకు తెలియదే!’’ అని దిశ అవగాహన సదస్సులోనే పేర్కొనడంతో అక్కడకు వచ్చిన వారు అవాక్కయ్యారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో దిశ యాప్‌పై పోలీస్‌ శాఖ శనివారం అవగాహన సదస్సు నిర్వహించింది. ‘దిశ’ డీఎస్పీ వాసుదేవ్‌.. చట్టంతో పాటు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జోగులు మాట్లాడుతూ.. తనకు అసలు దిశ చట్టం గురించి తెలియదన్నారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. 

Updated Date - 2021-08-01T08:27:56+05:30 IST