Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాబు చేసిన పాపం వల్లే తిరుపతికి ఈ గతి: Bhumana

తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన పాపం వలనే తిరుపతికి ఈ గతి పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో చెరువులు ఆక్రమణకు గురైందని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సెంటు కూడా భూ కబ్జా జరగలేదని తెలిపారు. హుడ్ హుడ్, తిట్లీ తుఫాన్ చంద్రబాబు హయాంలో వచ్చాయని.. చంద్రబాబు ఏ బాధితుడికి సహాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించారన్నారు. చంద్రబాబు ప్రచారాలకే పరిమితం అయ్యారని, ఫోటోలకు ఫోజులు ఇస్తారే తప్ప బాధితులకు ఒక రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. పుష్కరాల సమయంలో నలభై మంది అమాయక ప్రజలు బలైయ్యారని.. ఇందుకు కారణం చంద్రబాబే అని ఆరోపించారు. వరద బాధిత కుటుంబానికి రూ.2 వేలు ఆర్థిక సాయం, మూడు కోట్ల విలువైన నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తిరుపతిలో డ్రైనేజీ వ్యవస్థ బాగు కోసం రూ.189 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారన్నారు. చంద్రబాబు తిరుపతికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement