Abn logo
Jan 17 2021 @ 17:59PM

ప్రభుత్వానికి పేరు వస్తుందనే విపక్షాల ఆరోపణలు: అమర్నాథ్‌

విశాఖ: జిల్లాలో 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే చూడలేక అవాస్తమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. చివరికి మత పరమైన అంశాలు తెచ్చి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన మాటలు ఐదేళ్ల క్రితమైనవని గ్రహించాలని చెప్పారు. కేవలం రాజకీయాల కోసం దేవుళ్లను, విగ్రహాలను వాడుకోవద్దని కోరారు.

Advertisement
Advertisement
Advertisement